బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులకు మంటలు.. మూడు బస్సులు దగ్ధం!
హైదరాబాద్ నగర శివార్లలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బౌరంపేటలోని బొడ్రాయి సమీపంలో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పార్కింగ్ యార్డ్‌లో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ నగర శివార్లలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బౌరంపేటలోని బొడ్రాయి సమీపంలో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పార్కింగ్ యార్డ్‌లో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మూడు బస్సులు పూర్తిగా దగ్ధమవగా.. మరో రెండు బస్సులకు మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
స్థానికుల సమాచారం ప్రకారం.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన పలు బస్సులను యార్డ్‌లో ఒకదాని పక్కన మరొకటి పార్కింగ్ చేసి ఉంచారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. బస్సులన్నీ దగ్గరదగ్గరగా ఉండటంతో మంటలు వేగంగా పక్కనే ఉన్న వాహనాలకు వ్యాపించాయి. చూస్తుండగానే మూడు బస్సులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మరో రెండు బస్సులకు కూడా మంటలు అంటుకున్నాయి.

Bus Fire Accident
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Bus Fire Accident
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులకు మంటలు.. మూడు బస్సులు దగ్ధం!
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Sonakshi Sinha | సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫొటోల వివాదం.. నిందితుడికి ఊరటనిచ్చిన ముంబై కోర్టు
Ramayana | రామాయణం బాక్సాఫీస్ డే 10.. రూ. 1200 కోట్ల క్లబ్లో చేరిన రణ్‌బీర్-యశ్ చిత్రం
Student Missing | సిర్గాపూర్ ఎస్టీ గురుకులంలో పదో తరగతి విద్యార్థిని అదృశ్యం!
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

