Sonakshi Sinha | సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫొటోల వివాదం.. నిందితుడికి ఊరటనిచ్చిన ముంబై కోర్టు
Mumbai Court | నటి సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫోటోల కేసులో ఢిల్లీలో అరెస్టయిన ఆర్యన్ దీపక్ జైన్‌ను ముంబై కోర్టు విడుదల చేసింది. సరైన అరెస్ట్ నిబంధనలు, బీఎన్ఎస్ఎస్ (BNSS) చట్ట నిబంధనలను పోలీసులు పాటించకపోవడంతో ఈ అరెస్ట్ అక్రమమని మేజిస్ట్రేట్ స్పష్టం చేసింది.
నటి సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫోటోల కేసులో ఢిల్లీలో అరెస్టయిన ఆర్యన్ దీపక్ జైన్‌ను ముంబై కోర్టు విడుదల చేసింది. సరైన అరెస్ట్ నిబంధనలు, బీఎన్ఎస్ఎస్ (BNSS) చట్ట నిబంధనలను పోలీసులు పాటించకపోవడంతో ఈ అరెస్ట్ అక్రమమని మేజిస్ట్రేట్ స్పష్టం చేసింది. సోనాక్షి సిన్హా ఫిర్యాదు మేరకు ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, పోలీసులు ఢిల్లీలోని షహద్రా ప్రాంతంలో ఆర్యన్ దీపక్ జైన్‌ను అదుపులోకి తీసుకుని ముంబైకి తీసుకువచ్చారు.
అయితే, నిందితుడిని ముంబైకి తీసుకువచ్చే ముందు ఢిల్లీలోని స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడంలో పోలీసులు విఫలమయ్యారని కోర్టు గుర్తించింది. ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(1)(b) ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను, అరెస్ట్ కారాణన్ని నమోదు చేయడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారని న్యాయస్థానం పేర్కొంది. కేవలం దర్యాప్తు అవసరం అనే సాకుతో చట్టపరమైన రక్షణలను విస్మరించి ఎవరినీ నిర్బంధించలేమని తేల్చిచెప్పిన మేజిస్ట్రేట్, నిందితుడిని తక్షణమే విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonakshi Sinha | సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫొటోల వివాదం.. నిందితుడికి ఊరటనిచ్చిన ముంబై కోర్టు
Ramayana | రామాయణం బాక్సాఫీస్ డే 10.. రూ. 1200 కోట్ల క్లబ్లో చేరిన రణ్‌బీర్-యశ్ చిత్రం
Student Missing | సిర్గాపూర్ ఎస్టీ గురుకులంలో పదో తరగతి విద్యార్థిని అదృశ్యం!
Yadagirigutta | కార్తీక మాసం.. ఆదివారం సెలవు.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు!
Allu Arjun | అల్లు అర్జున్ నుంచి ‘రాకా’, ‘AA23’ అప్డేట్స్ వస్తాయా .. అభిమానుల్లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

