Ramayana | రామాయణం బాక్సాఫీస్ డే 10.. రూ. 1200 కోట్ల క్లబ్లో చేరిన రణ్‌బీర్-యశ్ చిత్రం
Ramayana | రామాయణం బాక్సాఫీస్ వద్ద పది రోజుల్లోనే రూ. 1200 కోట్ల మార్క్‌ను దాటేసింది. నితీశ్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 5న థియేటర్లలో విడుదలైంది.
రామాయణం బాక్సాఫీస్ వద్ద పది రోజుల్లోనే రూ. 1200 కోట్ల మార్క్‌ను దాటేసింది. నితీశ్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణాసురుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా న నటించారు. పది రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1,228 కోట్లు రాబట్టింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ. 819.50 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ. 408.50 కోట్లు వచ్చాయి. భారత్‌లో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూ. 685.60 కోట్లకు చేరాయి. కేవలం పదో రోజునే ఇండియాలో రూ. 72.90 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
ఈ చిత్ర హిందీ వెర్షన్ రూ. 527.25 కోట్లు రాబట్టగా, కన్నడ వెర్షన్ రూ. 57.35 కోట్లు, తెలుగు వెర్షన్ రూ. 44.90 కోట్లు, తమిళ వెర్షన్ రూ. 29.65 కోట్లు, మలయాళ వెర్షన్ రూ. 26.45 కోట్ల వసూళ్లను సాధించాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం నవంబర్ 5న విడుదల కాగా, రెండో భాగం 2028 దీపావళికి విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రామాయణం బాక్సాఫీస్ డే 10.. రూ. 1200 కోట్ల క్లబ్లో చేరిన రణ్‌బీర్-యశ్ చిత్రం
Student Missing | సిర్గాపూర్ ఎస్టీ గురుకులంలో పదో తరగతి విద్యార్థిని అదృశ్యం!
Yadagirigutta | కార్తీక మాసం.. ఆదివారం సెలవు.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు!
Allu Arjun | అల్లు అర్జున్ నుంచి ‘రాకా’, ‘AA23’ అప్డేట్స్ వస్తాయా .. అభిమానుల్లో భారీ అంచనాలు!
IND vs NZ | టాప్ ఆర్డర్ వైఫల్యం.. 209 పరుగులకే భారత్ ఆలౌట్!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

