Bank Employees | భారీగా పెరగనున్న బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు.. ఎంతంటే?
బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని 17 శాతం పెంచే ప్రతిపాదనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు శుక్రవారం ఒక అంగీకారానికి వచ్చాయి.
- బ్యాంక్ ఉద్యోగుల జీతాలు 17% పెంపు
- ఐబీఏ, యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం
Bank Employees | న్యూఢిల్లీ, మార్చి 8: బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని 17 శాతం పెంచే ప్రతిపాదనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు శుక్రవారం ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని 8 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కల్పించే ఈ పెంపుతో బ్యాంక్‌లపై ఏడాదికి రూ. 8,284 కోట్ల భారం పడుతుంది. 2022 నవంబర్ నుంచి అమలయ్యేలా ఈ పెంపుదల ఉంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ వెల్లడించింది. వివరాలు:
- కొత్త వేతన ఒప్పందం ప్రకారం 8088 పాయింట్ల డీఏను, ఆపై వచ్చినదానిని విలీనపర్చిన తర్వాత కొత్త పే స్కేల్స్‌ను నిర్ణయించారు. -మహిళా ఉద్యోగులందరూ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే నెలకు ఒక రోజు సిక్ లీవ్ తీసుకోవచ్చు.
- రిటైర్మెంట్ లేదా సర్వీసులో ఉండగా మరణిస్తే ఆ సమయానికి 255 రోజుల వరకూ ప్రివిలేజ్ లీవ్‌లను నగదుగా తీసుకోవచ్చు.
- రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తున్న పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్‌కు అదనంగా మంథ్లీ ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని చెల్లిస్తారు.
ఐదు రోజులే పని
అలాగే శనివారాలన్నింటికీ సెలవులుగా గుర్తించేందుకు అంగీకరించినట్టు తెలిపింది. అయితే 5 రోజుల పనిదినాలపై ప్రభుత్వ అంగీకారం కోసం చూస్తున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పనిగంటల సవరణ ఉంటుందని కాన్ఫడరేషన్ వివరించింది. వేతన ఒప్పందంపై పీఎస్‌యూ బ్యాంక్ యాజమాన్యాల అసోసియేషన్ ఐబీఏ, ఉద్యోగుల యూనియన్లు యూఎఫ్‌బీయూ, ఏఐబీవోఏ, ఏఐబీఏఎస్ఎం, బీకేఎస్ఎంలు సంతకాలు చేసినట్టు ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా ట్వీట్ చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

