Pentagon: హోర్ముజ్‌లో సీమైన్లను తొలగించేందుకు 6 నెలల పడుతుంది: పెంటగాన్
Pentagon : హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సీమైన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సీమైన్లను తొలగించేందుకు కనీసం ఆర్నెళ్ల సమయం పడుతుందని అమెరికా చట్టసభ ప్రతినిధులకు పెంటగాన్ తెలిపింది.
వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సీమైన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సీమైన్లను తొలగించేందుకు సుమారు ఆర్నెళ్ల సమయం పడుతుందని అమెరికా చట్టసభ ప్రతినిధులకు పెంటగాన్(Pentagon) తెలిపింది. హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీతో జరిగిన క్లాసిఫైడ్ బ్రీఫింగ్ సమయంలో రక్షణశాఖ ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఎంత ఖర్చు అయ్యిందన్న అంశాన్ని చట్టసభ ప్రతినిధులు ప్రశ్నించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీన టెహ్రాన్‌పై దాడి జరిగిన సమయంలో ఓ స్కూల్‌పై కూడా బాంబు పడిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో మినాబ్ పాఠశాలకు చెందిన సుమారు 168 మంది చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన పట్ల కూడా చట్టసభ ప్రతినిధులు పెంటగాన్ బ్రీఫింగ్లో ప్రశ్నలు కురిపించినట్లు తెలిసింది. కానీ దానికి సరైన సమాధానాలు దొరకలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

