Pentagon Lockdown | అమెరికా మిలిటరీ హెడ్ క్వార్టర్ పెంటగాన్ పరిధిలో లాక్డౌన్ విధించినట్లు సమాచారం. పెంటగాన్‌కు సమీపంలోని సబ్వే స్టేషన్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో పెంటగాన్ పరిసర ప్రాంతాల భద్రతను పరిగణనలోకి తీసుకుని మంగళవారం లాక్డౌన్ విధించినట్లు తెలుస్తున్నది.
కాల్పులు జరిగిన సబ్వే.. పెంటగాన్ ప్రధాన భవనానికి కొన్ని డజన్ల గజాల దూరంలోనే ఉండటం గమనార్హం. దీంతో ఆర్లింగ్టన్ సబర్బన్ పరిధిలో విధులు నిర్వర్తించాలని డిఫెన్స్ ఉద్యోగులను పెంటగాన్ ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
పెంటగాన్ ట్రాన్సిట్ సెంటర్ వద్ద ఈ కాల్పుల ఉదంతం చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు అటువైపుగా రావద్దని పెంటగాన్ ట్వీట్ చేసింది. ఈ ప్రాంతంలో భారీగా సెక్యూరిటీ, ఫైర్, సహాయ సిబ్బంది వాహనాలను మోహరించిన దృశ్యాలను స్థానిక మీడియా చానెళ్లు ప్రసారం చేశాయి. ఈ కాల్పుల్లో ఎంత మంది గాయపడ్డారన్న సమాచారం అందుబాటులోకి రాలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ola bookings|.. రూ.499 చెల్లిస్తే సరి.. ఈ-స్కూటర్ రెడీ..!
ఓలా ఈ-స్కూటర్‌ను ఎలా నడుపాలో తెలుసా..?!
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!