సింగపూర్/విజయవాడ: సింగపూర్‌లో మంగళవారం జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడితో పాటు మరో 19 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనలో పదేండ్ల బాలిక మృతి చెందిందని అధికారులు తెలిపారు. రివర్ వ్యాలీ రోడ్‌లోని మూడంతస్తుల షాప్ హౌస్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ (8) చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాద సమయంలో ఏర్పడిన పొగ పీల్చడం వల్ల అతడి ఊపిరితిత్తులపై ప్రభావం పడిందని ఆ పార్టీ వెల్లడించింది. శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ పవన్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు.