Joe Biden | కొత్త తరానికి అవకాశం కల్పించడానికే.. తప్పుకున్నా: జో బైడెన్
దేశాన్ని ఏకతాటిపై నిలపడానికి కొత్త తరానికి అవకాశం కల్పించడానికే తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అన్నారు. తర్వాత తరానికి బాధ్యతలను అప్పగించడమే మేలైన మార్గమని భావించినట్లు వెల్లడించారు.
వాషింగ్టన్: దేశాన్ని ఏకతాటిపై నిలపడానికి కొత్త తరానికి అవకాశం కల్పించడానికే తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అన్నారు. తర్వాత తరానికి బాధ్యతలను అప్పగించడమే మేలైన మార్గమని భావించినట్లు వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన తర్వాత ఆయన తొలిసారి ప్రసంగించారు. ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కంటే పదవులు ముఖ్యం కాదని చెప్పారు. యువ గళం వినిపించడానికి ఇదే సరైన సమయమని వెల్లడించారు. అమెరికా రాజకీయాల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోందని.. దానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
నియంత, నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదంటూ పరోక్షంగా ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమర్థురాలన్నారు. ఆమె అధ్యక్ష అభ్యర్థికి తగిన వ్యక్తి అని పునరుద్ఘాటించారు. డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా హారిస్ తగిన వ్యక్తి అని అన్నారు.
అధ్యక్ష కార్యాలయాన్ని గౌరవిస్తానని చెప్పారు. అంతకంటే ఎక్కువగా దేశాన్ని ప్రేమిస్తున్నానని తెలిపారు. అమెరికా ప్రజలకు అధ్యక్షుడిగా పనిచేయడం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవమని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రజలంతా ఏకం కావాలని చెప్పారు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని ఏకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అధ్యక్షుడిగా, అమెరికా భవిష్యత్తు కోసం రెండోసారి ప్రెసిడెంట్‌గా పోటీ చేసే సామర్ధ్యం తనకు ఉందని నమ్ముతున్నాని చెప్పారు. కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ఏది అడ్డురాకూడదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నానని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

