పారిస్, డిసెంబర్ 24: ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్‌లో మంగళవారం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 1200 మందిని ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయించారు. కొన్ని అంతస్తుల్లో మంటలు కన్పించడంతో అక్కడికి చేరుకున్న అత్యవసర బృందాలు అక్కడ ఉన్న సందర్శకులను ఖాళీ చేయి ంచి, వారిని దూరంగా తీసుకుని పోయా రు.
ప్రస్తుతం ఈఫిల్ టవర్‌ను తాత్కాలికంగా మూసివేసి మెయింటెనెన్స్ పనులు చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ఎలివేటర్ షాఫ్ట్ వద్ద ఉదయం 10.50 గంటలకు మంటలను చూసినట్టు ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయని సందర్శకులు అంతా సురక్షితమని నిర్వాహకులు చెప్పారు.