Doha mall | తమ అణుకేంద్రాలపై అగ్రరాజ్యం అమెరికా జరిపిన దాడులకు ఇరాన్ (Iran) ప్రతీకార దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి ఖతార్ (Qatar)లోని అమెరికా వైమానిక స్థావరం అల్-ఉదీద్పై (US Al-Udeid base) క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడితో ఖతార్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఖతార్ రాజధాని దోహాలో కూడా భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు శబ్దాలకు ఎక్కడికక్కడ ప్రజలు పరుగులు తీశారు. దోహాలోని ఓ మాల్లో (Doha mall) ఉన్న ప్రజలు వెంటనే బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
आज Qatar को भी समझ में आ गया होगा की वो जिसे अपना पिता बनाये हुए था…
वो भी सुपर पावर ईरान से डरता है…#IsraeliranWar Qaatr #DOHA #IranIsraelConflict pic.twitter.com/GsosJGWCaR
— A K Bhohariya (@k54176) June 24, 2025
ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా అమెరికా ఆదివారం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారంగా ఖతార్ (Qatar)లోని అమెరికా వైమానిక స్థావరం అల్-ఉదీద్పై (US Al-Udeid base) ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఇరాన్ సాయుధ దళాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ‘ఇరాన్ భూభాగంపై జరిగే ఎలాంటి దాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధానం ఇవ్వకుండా ఉండం’ అని పేర్కొన్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి అమెరికా ఉపయోగించిన బాంబుల సంఖ్యనే తమ సాయుధ దళాలు ఉపయోగించినట్లు ఇరాన్ అత్యున్నత భద్రతా సంస్థ తెలిపింది. అయితే, ఇరాన్ దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ అధికారులు తెలిపారు.
ఈ దాడుల అనంతరం ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం (ceasefire) అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చే ముందు ఇజ్రాయెల్‌పై చివరి క్షిపణి ప్రయోగించినట్లు వెల్లడించింది. ఇరాన్ ప్రకటనతో ఇజ్రాయెల్‌తో 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది.
🚨 Missiles Over Doha!
Panic erupts in Qatar as Iranian missiles light up the sky — citizens seen running through the streets of the capital.#MissileStrike #QatarUnderFire #Doha #IranAttack #MiddleEastTensions pic.twitter.com/y1xDM1HqwT
— geo politics (@GPoliticshub) June 24, 2025
Also Read..
JD Vance | భవిష్యత్తులో అలా చేయాలనుకుంటే.. కాల్పుల విరమణ వేళ ఇరాన్‌కు జేడీ వాన్స్ కీలక హెచ్చరిక
Israel-Iran | గగనతలాన్ని మూసివేసిన గల్ఫ్ దేశాలు.. ఎయిర్ ఇండియా సహా పలు విమాన సర్వీసులు రద్దు
Qatar | అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడులు.. ఖతార్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక అడ్వైజరీ