McDonalds Store : ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ద రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరువర్గాల పరస్పర దాడులతో గాజా అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో కొందరు పాలస్తీనా ప్రజలు ఇజ్రాయేల్‌కు మద్ధతిస్తున్న దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఒక పాలస్తీనా మద్దతుదారుడు లండన్‌లో వీరంగం సృష్టించాడు.
బర్మింగ్హమ్లోని ఒక మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌లో ఎలుకల్ని(Rats) వదిలి.. పాలస్తీనాను స్వేచ్ఛగా వదిలేయండి అంటూ గట్టిగా అరిచాడు. ఎలుకల గుంపుని చూసి షాక్ తిన్న అక్కడి జనం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
సదరు వ్యక్తి ఫ్రీ పాలస్తీనా అని రాసున్న నంబర్ ప్లేటు, ఒక బాక్స్ పట్టుకొని మెక్డొనాల్డ్స్లోకి ప్రవేశించాడు. ఉంది. తలకు పెట్టుకున్న బ్యాడ్జీ మీద పాలస్తీనా జెండా ఉంది. అక్కడ ఉన్నవాళ్ల వంక చూస్తూ బాక్స్‌లోని ఎలుకల్ని వదిలేశాడు. ఇజ్రాయెల్‌కు వత్తాసు పలుకుతున్నందుకు బాయ్‌కాట్ మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్ అంటూ నినాదాలు చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి ఎలుకల్ని తొలిగించి, రెస్టారెంట్‌ను శానిటైజ్ చేశారు. హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ సైనికులకు ఉచితంగా ఆహారం అందిస్తామని మెక్‌డొనాల్డ్స్ ప్రకటించింది. దాంతో, ఆగ్రహం చెందిన పాలస్తీనా మద్దతుదారుడు ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.