Sharda Peeth | పీవోకే శారదా పీఠాన్ని ఆక్రమించిన పాక్ సైన్యం..! కాఫీ హోం నిర్మిస్తుందట..!
Sharda Peeth | పీవోకేలోని కశ్మీరీ పండిట్ల విశ్వాసానికి ప్రతీక అయిన సరస్వతీ దేవి పురాతన దేవాలయం శారదా పీఠాన్ని పాక్ సైన్యం స్వాధీనం చేసుకున్నది. ఎల్ఓసీ సమీపంలోని నీలం నది ఒడ్డున ఉన్న ఆలయం స్థానంలో పాక్ సైన్యం కాఫీ హోమ్‌ను నిర్మించనున్నది.
Sharda Peeth | పీవోకేలోని కశ్మీరీ పండిట్ల విశ్వాసానికి ప్రతీక అయిన సరస్వతీ దేవి పురాతన దేవాలయం శారదా పీఠాన్ని పాక్ సైన్యం స్వాధీనం చేసుకున్నది. ఎల్ఓసీ సమీపంలోని నీలం నది ఒడ్డున ఉన్న ఆలయం స్థానంలో పాక్ సైన్యం కాఫీ హోమ్‌ను నిర్మించనున్నది. ఈ శారదా పీఠం ముజఫరాబాద్ నుంచి 140 కిలోమీటర్లు, కుప్వారా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అయితే, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని శారదా కమిటీ వ్యవస్థాపకుడు రవీంద్ర పండిట్ కోరారు. ఈ మేరకు కమిటీ నవంబర్ 30న ప్రధాని కార్యాలయానికి లేఖ రాసింది.
ఈ నెల 1న పీఎం కార్యాలయానికి లేఖ అందింది. శారదా పీఠం ఆలయంపై పాక్ సైన్యం దురాక్రమణకు పాల్పడడంపై జమ్మూ కశ్మీర్‌లోని హిందూ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. రెవెన్యూ రికార్డుల ప్రకారం శారదా పీఠం కాంప్లెక్స్‌లో 73 కెనాల్స్ విస్తీర్ణం ఉండగా.. ప్రస్తుతం ఆక్రమణ కారణంగా పది కెనాల్స్ మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం ఇక్కడ పాక్ సైన్యం సైతం చొరబాటుకు యత్నిస్తున్నది. ఈ క్రమంలో పాక్‌తో చర్చలు జరిపిన అవసరమైన చర్యలు తీసుకోవాలని రవీంద్ర పండిట్ ప్రధాని కార్యాలయాన్ని కోరారు. అలాగే శారదా పీఠం మరమ్మతు పనులు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

