కొలంబో : దిత్వా తుఫాన్‌తో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన శ్రీలంకకు పాకిస్థాన్ దేశం మావనతా సహాయంగా పాచిపోయిన ఆహార పదార్ధాలు, కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపి అంతర్జాతీయంగా నవ్వుల పాలయ్యింది.
ఆ దేశానికి మానవతా సహాయంగా పాకిస్థాన్ మందులు, ఆహారపదార్ధాలు, అత్యవసర సామగ్రిని పంపింది. అయితే ఎక్స్పైరీ అయిన మందులు, పాచిపోయిన ఆహార పదార్ధాలు, నాసిరకం సామగ్రి అందులో ఉండటం పట్ల శ్రీలంక దౌత్య వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.