ఇస్లామాబాద్ : భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. సిక్కు మత స్థాపకుడు గురునానక్ 556వ జయంతి వేడుకల కోసం పాకిస్థాన్‌లోని నానకానా సాహిబ్‌కు వెళ్తున్న 12 మంది భారతీయ యాత్రికులను పాకిస్థాన్ అధికారులు అడ్డుకుని, వెనక్కి పంపారు.
వారు సిక్కులు కాదని, హిందువులని పేర్కొంటూ పాకిస్థాన్ చర్య తీసుకోవడం వివాదానికి దారితీసింది.