లాహోర్: పాకిస్థాన్లోని ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులో పోలీసు వాహనాన్ని పేల్చివేశారు. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతిచెందారు. ఐఈడీ బాంబు(IED Blast)తో పేల్చివేసిన ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ)కి చెందిన ఓ యూనిట్ పోలీసు వాహనాన్ని టార్గెట్ చేసింది. పేలుడు తర్వాత చెల్లాచెదురుగా పడిన పోలీసు ఆఫీసర్లను టీటీపీ సభ్యులు షూట్ చేశారు. పేలిన ప్రదేశంలో వాహనం ఓ వైపునకు పడి ఉన్నది. టంక్ జి్లాలో ఈ ఘటన జరిగింది. రిమోట్ కంట్రోల్ బాంబుతో పేల్చివేశారని టంక్ జిల్లా పోలీసు అధికారి పర్వేజ్ షా తెలిపారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో మరణించినట్లు చెప్పారు. ఎస్హెచ్వో, సబ్ ఇన్స్పెక్టర్, ఎలైట్ ఫోర్స్ సిబ్బంది, డ్రైవర్ మృతిచెందినవారిలో ఉన్నారు.
#BREAKING: Tehreek-e-Taliban Pakistan has released a video showing an IED attack on a Pakistani police armored vehicle near Tank of Khyber Pakhtunkhwa in Pakistan, in which 7 police personnel, including an SHO, were reportedly killed yesterday. pic.twitter.com/B6FjOLw7bf
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 14, 2026