ఇస్లామాబాద్, ఫిబ్రవరి 6: అసలే తీవ్ర ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న పాకిస్థాన్ దేశానికి కొందరు చిల్లర చోరులు మ్యాన్ హోల్స్‌పై మూతలను ఎత్తుకుపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో చిన్న నేరమైనా పెద్ద శిక్ష వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ఇకపై ఈ మూతలు అపహరించిన వారికి 10 ఏండ్ల జైలుతో పాటు 50 లక్షల పాకిస్థానీ రూపాయలను జరిమానాగా విధిస్తామని పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలో ఇక నుంచి మ్యాన్‌హోల్ మూతలను అపహరించినా, అమ్మినా, కొన్నా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.