ఇస్లామాబాద్, ఫిబ్రవరి 18 : కశ్మీర్‌పై పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యకు దిగింది. కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని భారత్‌ను కోరుతూ ఆ దేశ పార్లమెంట్ మంగళవారం ఒక తీర్మానాన్ని చేసింది. అలాగే కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దును ఖండిస్తూ కశ్మీర్ లోయలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని విమర్శించింది. మన దేశ నేతలు, మిలటరీ అధికారులు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్పై రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది.