High Alert | శాంతి చర్చలవేళ పాకిస్థాన్‌లో హైఅలర్ట్.. ఇస్లామాబాద్‌లో రెడ్ జోన్‌కు మూత..!
High Alert | అమెరికా-ఇరాన్ (USA-Iran) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు మాత్రం ముగిసిపోలేదు. కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్ (Israel).. లెబనాన్ (Lebanon) పై దాడులు చేయడం, అందుకు ప్రతిగా ఇరాన్ హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని మళ్లీ మూసివేయడం లాంటి పరిణామాలు ఉద్రిక్తతలను పెంచాయి.
High Alert : అమెరికా-ఇరాన్ (USA-Iran) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా.. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు మాత్రం ముగిసిపోలేదు. కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్ (Israel).. లెబనాన్ (Lebanon) పై దాడులు చేయడం, అందుకు ప్రతిగా ఇరాన్ హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని మళ్లీ మూసివేయడం లాంటి పరిణామాలు ఉద్రిక్తతలను పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు శాంతి చర్చలకు పాకిస్థాన్ (Pakistan) ఆతిథ్యం ఇస్తోంది. ఏప్రిల్ 11న రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) లో చర్చలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హై అలర్ట్‌లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ భవనాలు, కీలక రహదారి మార్గాల వద్ద భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. రాజధానిలోని రెడ్‌జోన్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. అక్కడ పరిమిత సంఖ్యలోనే జనసంచారం కనిపిస్తోంది. అంటే ఒక రకంగా రెడ్‌జోన్‌ను పూర్తిగా సీల్ చేశారు. అంటే మూతవేశారు. ఇస్లామాబాద్‌లో ఉన్న పార్లమెంట్, కీలక ప్రభుత్వ కార్యాలయాలు, లగ్జరీ హోటళ్లు, ఎంబసీలు, విదేశీ సంస్థల కార్యాలయాలు ఉన్న ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా పిలుస్తారు. శాంతి చర్చల నేపథ్యంలో ఇప్పుడు ఇస్లామాబాద్‌లో సెలవు ప్రకటించారు. దుకాణ సముదాయాలు కూడా మూతపడ్డాయి.
తమ మధ్యవర్తిత్వంతోనే అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని పాకిస్థాన్ చెప్పింది. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యం ఇస్తోంది. ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నేతృత్వంలోని బృందం అమెరికా తరఫున చర్చల్లో పాల్గొననున్నట్లు తెలుస్తున్నది. ఇక ఇరాన్ వైపు నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ పాకిస్థాన్ బయలుదేరారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలను ఇరాన్ ఖండించింది. ఆ ఇద్దరూ తమ రాజధాని టెహ్రాన్‌లోనే ఉన్నారని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

