Pakistan | సౌదీ అరేబియాలో పాక్ సైన్యం, యుద్ధ విమానాలు.. ఇరాన్‌తో యుద్ధం వేళ మోహరించిన పాక్
Pakistan : ఇరాన్–అమెరికా యుద్ధ సమయంలో పాకిస్తాన్ వైఖరి అనేక అనుమానాలకు తావిచ్చింది. సౌదీ అరేబియాలో పాకిస్తాన్ భారీ సైన్యాన్ని మోహరించినట్లు తాజాగా వెల్లడైంది.
Pakistan : ఇరాన్–అమెరికా యుద్ధ సమయంలో పాకిస్తాన్ వైఖరి అనేక అనుమానాలకు తావిచ్చింది. సౌదీ అరేబియాలో పాకిస్తాన్ భారీ సైన్యాన్ని మోహరించినట్లు తాజాగా వెల్లడైంది. అంతేకాదు.. సౌదీ అరేబియాకు రక్షణగా 16 యుద్ధ విమానాల్ని కూడా పాక్ అందుబాటులో ఉంచినట్లు తేలింది. ఈ విషయాన్ని పాక్, సౌదీ అరేబియాకు చెందిన సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.
అయితే, అధికారికంగా మాత్రం కాదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సౌదీ అరేబియాకు పాకిస్తాన్ 8,000 ట్రూపుల్ని, స్క్వాడ్రన్ యుద్ధ విమానాల్ని పంపించింది. ఒకవేళ మళ్లీ సౌదీ అరేబియాపై దాడి జరిగితే స్పందించేందుకు పాక్ సైనికులతోపాటు, యుద్ధ విమానాలు కూడా సిద్ధంగా ఉంచారు. చైనాతో కలిసి తయారు చేసిన జేఎఫ్–17 అనే 16 యుద్ధ విమానాల్ని పాక్.. సౌదీలో మోహరించింది. అవసరమైతే మరింతమంది సైన్యాన్ని, యుద్ధ విమానాల్ని కూడా పంపిస్తామని సౌదీకి తెలిపింది. పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఏడాది క్రితం రక్షణ ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించిన స్పష్టమైన విధి విధానాలు తెలియవు.
కానీ, సైనిక పరంగా అవసరమైనప్పుడు ఒకదానికి ఒకటి సహకరించుకోవాలన్నది ప్రధాన ఒప్పందం. ఎందుకంటే సౌదీ అరేబియా వద్ద సొంత సైన్యం, యుద్ధ విమానాలు పెద్దగా లేవు. అందువల్ల ఈ విషయంలో పాక్ సాయం అడిగింది. సౌదీకి ఎప్పుడు అవసరమైనా.. పాక్ సైనిక సాయం అందించాలి. పాకిస్తాన్‌కు అవసరమైనప్పుడు కూడా సౌదీ సాయపడాలి. ఇక, తాజాగా సౌదీలో పాక్ సైనిక మోహరింపుపై ఇటు పాక్.. అటు సౌదీ అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇటీవల సౌదీపై ఇరాన్ పలుసార్లు దాడులకు దిగింది.
ఇదే సమయంలో సౌదీ కూడా ఇరాన్‌పై దాడులకు పాల్పడింది. కానీ, దీనిపై ఇరాన్ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. పాకిస్తాన్ ఒకవైపు ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తూనే.. ఇరాన్‌కు వ్యతిరేకంగా సౌదీలో తన సైన్యాన్ని మోహరించడం ఇక్కడ విశేషం.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Iran war
- jets
- Pakistan
- saudi arabia
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

