రావల్పిండి: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్(Asim Munir) తన మూడవ కుమార్తె వివాహం చేశారు. డిసెంబర్ 26వ తేదీన రావల్పిండిలో సైనిక ప్రధానకార్యాలయంలో ఆ పెళ్లి వేడుక జరిగింది. అయితే తన సోదరుడి కుమారుడికే.. తన కూతుర్ని ఇచ్చి అసిమ్ మునీర్ పెళ్లి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్థానిక జర్నలిస్టులు కొన్ని కథనాలు రాశారు. ఆ పెళ్లిని చాలా గోప్యంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. సీనియర్ రాజకీయనేతలు, సైనిక అధికారులు ఆ మ్యారేజీకి హాజరయ్యారు. సెక్యూర్టీ కారణాల వల్ల వేడుకను చాలా సైలెంట్‌గా చేశారు. పెళ్లికి చెందిన అధికారిక ఫోటోలు ఇంకా రిలీజ్ కాలేదు.
ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్‌కు నలుగురు కూతుళ్లు ఉన్నారు. దాంట్లో మహనూర్ మూడవ కుమార్తె. కెప్టెన్ అబ్దుల్ రెహ్మాన్ ఖాసిమ్‌ను ఆమె పెళ్లి చేసుకున్నది. సుమారు 400 మంది అతిథులు హాజరైనట్లు తెలుస్తోంది. ప్రెసిడెంట్ ఆసిప్ అలీ జర్దారీ, పీఎం షెహబాజ్ షరీఫ్, డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ ఉన్నారు. పెళ్లికుమారుడు అబ్దుల్ రెహ్మన్ గతంలో పాకిస్థాన్ ఆర్మీలో కెప్టెన్‌గా చేశారు. మిలిటరీ సర్వీసు ముగిసిన తర్వాత అతను సివిల్ అడ్మినిస్ట్రేషన్‌లో చేరారు. ఆర్మీ ఆఫీసర్ల కోటాలో ఆయన ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం అసిస్టెంట్ కమీషనర్‌గా కొనసాగుతున్నారు.
Who attended marriage ceremony of Field Marshal Syed Asim Munir’s daughter wedding? pic.twitter.com/tX3LyDihKS
— Zahid Gishkori (@ZahidGishkori) December 30, 2025