Pakistan | పాకిస్తాన్‌లోని క్వెట్టాలో భారీ పేలుడు.. 24 మంది మృతి.. 50 మందికి గాయాలు
Pakistan : పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 24 మంది మరణించగా, 50 మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలోని చమాన్ పాతక్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.
Pakistan : పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 24 మంది మరణించగా, 50 మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలోని చమాన్ పాతక్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న రైలు అక్కడి సిగ్నల్ దాటుతుండగా, పేలుడు పదార్థాలతో ఉన్న ఒక కార్ ట్రాక్‌పైకి దూసుకొచ్చి, రైలును ఢీకొని పేలిపోయింది.
ఈ ఘటనలో 24 మంది మరణించగా, 50 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా పాక్ ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఇది ఆత్మాహుతి దాడిగా అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి రైల్వే స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన పలు కార్లు దెబ్బతిన్నాయి. రైలు బోగి కూడా ధ్వంసమైంది. పేలుడు తీవ్రతతో వాహనాలకు చెందిన గ్లాస్లు, వాహన భాగాలు ఎగిరిపోయి సమీపంలోని బిల్డింగ్‌లపై పడ్డాయి. పేలుడు జరగగానే స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఘటన సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటనతో అధికారులు క్వెట్టాలోని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి సెలవులు రద్దు చేసి, అందరూ విధులకు హాజరు కావాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సిటీ అంతా హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావొద్దని, ప్రమాదం జరిగిన ప్రదేశానికి రావొద్దని ఆదేశించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

