Pak PM Imran Khan | అమెరికాపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం వెనుక అమెరికా ఉందని చెప్పారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం దేశ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇమ్రాన్‌ఖాన్ జాతినుద్దేశించి మాట్లాడారు.
తాను ఒక పప్పెట్లా ఉండాలని అమెరికా భావించిందని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. తనను తోలుబొమ్మను చేసి ఆడించాలనుకుందని వ్యాఖ్యానించారు. రష్యాలో తాను పర్యటించడం అమెరికాకు నచ్చలేదన్నారు. తన రష్యా పర్యటన అమెరికాకు ఇష్టం లేదన్నారు.
అలాగే భారత్‌పై ఇమ్రాన్‌ఖాన్ మరోమారు ప్రశంసల జోరు పెంచారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్‌ను శాసించలేదని స్పష్టం చేశారు. భారత్ విదేశాంగ విధానం బాగున్నదంటూ మెచ్చుకున్నారు. ఆదివారం దేశవ్యాప్త ప్రదర్శనలు చేయాలని జాతికి పిలుపునిచ్చారు.