Hajj Yatra | హజ్‌యాత్రలో 1301 మంది మృతి.. అధికారికంగా ప్రకటించిన సౌదీ
ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు మృతిచెందారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు వేల సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో యాత్రకు వచ్చినవారిలో 1,301 మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
కైరో: ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు మృతిచెందారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు వేల సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో యాత్రకు వచ్చినవారిలో 1,301 మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్ చేయడానికి వచ్చారని తెలిపింది. కాగా, అస్వస్థతకు గురైన 95 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. చనిపోయిన వారిలో 98 మంది భారతీయులు ఉన్నారు.
ఈ ఏడాది హజ్ యాత్రకు దాదాపు 22 దేశాల నుంచి పది లక్షల మంది యాత్రికులు రాగా.. సౌదీ అరేబియా పౌరులు 2 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈజిప్టు నుంచి మరో 10 లక్షలకుపైగా ముస్లింలు తరలివచ్చారని ప్రభుత్వం తెలిపింది. అయితే అధిక ఎండలు, వేడి గాలుల వల్ల యాత్రికులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారని పేర్కొంది. ఉక్కపోతతో ఊపిరాడక వారంతా చనిపోయినట్టు వెల్లడించింది. మరణాలు సంభవించిన రోజున రికార్డు స్థాయిలో 125 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు అధికారులు చెప్పారు.
హజ్ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్రకు వెళ్లినట్లు తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాల వల్లే వీరంతా మరణించారని వెల్లడించింది. అయితే గతంలో కన్నా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గిందని, గత ఏడాది 187 మంది మరణించినట్టు పేర్కొంది.
Almost two millions of pilgrims has performed the Hajj easily and safely, with all needed services, the numbers of deaths are 1301 and 83% of them has no permit and tried to came to #Mecca through mountains with no shelter and with high temperatures #Hajj pic.twitter.com/QOt2Hytndt
— Ahmmed (@Ahmeeed_839) June 24, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

