న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా మహిళలకు రక్షణ కరువైందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిరోజూ సగటున 137 మంది మహిళలు లేదా యువతులు (ప్రతి 10 నిమిషాలకు ఓ హత్య) తమ భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నట్టు ఐరాస పేర్కొన్నది. 2024లో ప్రపంచవ్యాప్తంగా స్త్రీ హత్యలపై జరిపిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2024లో 83,000 మంది మహిళలు, యువతులు పురుషుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ హత్యలలో 60 శాతం మంది బాధితురాలికి అత్యంత సన్నిహితమైనవారేనని నివేదిక తెలిపింది. ‘గణాంకాలు చెప్పేది ఏమిటంటే, మహిళలు ముఖ్యంగా.. ఇంట్లోనే ఎక్కువగా హింసకు గురవుతున్నారు’ అని నివేదిక పేర్కొంది.