బ్యాంకాక్: థాయిలాండ్‌లోని సోంఖ్లా ప్రావిన్స్ హ్యాట్యై జిల్లాలోని ఓ స్కూల్లో బుధవారం తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయి. స్కూల్లో చొరబడ్డ 18 ఏండ్ల యువకుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడగా, స్కూల్ డైరెక్టర్ మరణించాడు. నిందితుడు సహా మరో ఇద్దరు గాయపడ్డారు.
పాఠశాలపై దుండగుడు అనేకమార్లు కాల్పులు జరిపాడని, పలువురు టీచర్లు, విద్యార్థులను బందీలుగా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే భద్రతా సిబ్బంది వారందర్నీ సురక్షితంగా విడిపించినట్టు వార్తలు వెలువడ్డాయి.