Pakistan | ఇస్లామాబాద్: పాకిస్థానీలు కోడి గుడ్లను కొనాలంటేనే భయపడుతున్నారు. పౌల్ట్రీలో ఉపయోగించే సోయాబీన్ సరఫరా తగ్గిపోవడంతో, గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. 30 డజన్ల గుడ్ల ధర రూ.10,500 నుంచి రూ.12,500కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డజను గుడ్లను రూ.360కి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ, రిటైల్ వ్యాపారులు రూ.389కి అమ్ముతున్నారు. ఒక్కో గడ్డు ధర రూ.32కి చేరుకుంది.
సోయాబీన్స్ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, ఇంకా నోటిఫికేషన్ను జారీ చేయలేదు. ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతున్నట్లు ఆల్ పాకిస్థాన్ బిజినెస్ ఫోరం తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నది.