ప్రస్తుతం ప్రపంచం మొత్తం ‘ఒమిక్రాన్’ వేరియంట్ పేరు వినబడితే చాలు ఉలిక్కిపడుతోంది. ఈ వేరియంట్ గురించి తొలిసారిగా సౌతాఫ్రికా శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని హెచ్చరించారు. అంతే ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి కొన్ని దేశాలు.
ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. తొలుత ఒమిక్రాన్ వెలుగు చూసింది సౌతాఫ్రికాలో కాదట. ఈ నెల 24న ‘ఒమిక్రాన్ వేరియంట్ గురించి దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు సమాచారం అందించారు.
అయితే అంతకు ముందు నవంబరు 19-23 మధ్య నెదర్లాండ్స్‌లో సేకరించిన కొన్ని శాంపిల్స్‌లో ‘ఒమిక్రాన్’ వేరియంట్ లభ్యమైందట. ఈ విషయాన్ని డచ్ ఆరోగ్య శాఖ స్వయంగా ప్రకటించింది. అయితే ఈ వేరియంట్ కనిపించింది నెదర్లాండ్స్ పౌరుల్లోనా? లేక దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారిలోనా? అనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు.