బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 17:02:03

రైలు ప‌ట్టాల్లో ఇరుక్కున్న వృద్ధుడి వీల్‌చైర్‌.. రెప్ప‌పాటు వేగంతో కాపాడిన మ‌హిళ‌!

రైలు ప‌ట్టాల్లో ఇరుక్కున్న వృద్ధుడి వీల్‌చైర్‌.. రెప్ప‌పాటు వేగంతో కాపాడిన మ‌హిళ‌!

ఎంత ప్ర‌మాదం. కాస్త లేట‌యింటే ఆ వృద్దుడు రైలు కింద ప‌డి మ‌ర‌ణించేవాడు. దేవ‌త‌లా ఒక అమ్మాయి వ‌చ్చి కాపాడింది కాబ‌ట్టి స‌రిపోయింది. లేకుంటే.. ఊహించుకోవ‌డానికి క‌ష్టంగా ఉంటుంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 66 ఏండ్ల వృద్దుడు వీల్‌చైర్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఒంట‌రిగా రైల్వేట్రాక్‌ను దాటాల‌నుకున్నాడు. ఆ స‌మ‌యంలో అక్క‌డ రైలు వ‌చ్చే తాకిడి కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ ప్ర‌య‌త్నానికి పాల్ప‌డ్డాడు. పాపం.. ఒక చ‌క్రం ప‌ట్టాల్లో ఇరుక్కుపోయింది.

ఎంత ప్ర‌య‌త్నించినా రాలేదు. పైగా ఎదురుగా రైలు కూడా వ‌స్తుంది. ఒక‌వైపు రైలు.. మ‌రో వైపు ప్రాణాలు ఏం చేయ‌లేని నిరుత్సాహంలో ఉన్న‌ప్పుడు అటుగా వెళ్తున్న ఎరికా యురియా అనే మ‌హిళా పోలీస్ మెరుపులా వ‌చ్చి అత‌న్ని వీల్‌చైర్ నుంచి త‌ప్పించింది. ఒక్క సెకను లేట‌యినా ఇద్ద‌రి ప్రాణాల‌కే ప్ర‌మాదం జ‌రిగేది. ఈ సంఘ‌ట‌న అంతా ఆమె బాడీ కెమెరాలో రికార్డ‌య్యాయి. మ‌హిళా పోలీస్‌ను అభినందిస్తూ అధికారులు వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో చూసిన వారంద‌రూ ఆమెకు సెల్యూట్ కొడుతున్నారు. 


 


logo