Blue Rays | న్యూఢిల్లీ, జూలై 28: స్మార్ట్ఫోన్లు అతిగా వాడితే కళ్లు ఒత్తిడికి గురవుతాయని, నిద్రకు భంగం వాటిల్లుతుందని తెలిసిందే. అయితే ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, టీవీల నుంచి వెలువడే నీలి కాంతి వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతాయని తాజా అధ్యయనంలో తేలింది. మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ, డెట్రాయిట్‌లోని హెన్రీ ఫోర్డ్ దవాఖాన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. నీలి కాంతి కొల్లాజెన్ ప్రొటీన్‌పై ప్రభావం చూపుతుందని, ఇది చర్మంపై ముడతలకు దారితీస్తుందని పరిశోధకులు వెల్లడించారు.