North Korea: యుద్ధ ట్యాంక్ నడిపిన కిమ్ టీనేజ్ కుమార్తె.. ఫోటోలు వైరల్
North Korea : ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ 13 ఏళ్ల కుమార్తె యుద్ధ ట్యాంక్‌ను నడిపింది. ఈ ఘటనకు చెందిన ఫోటోలను ప్రభుత్వం మీడియా రిలీజ్ చేసింది. ఆ అమ్మాయి ఆర్మీ ట్యాంక్‌ను డ్రైవ్ చేస్తుండగా.. ఆమె పక్కనే కిమ్ జాంగ్ కూర్చున్నారు.
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా(North Korea) నేత కిమ్ జాంగ్ ఉన్ 13 ఏళ్ల కుమార్తె జూ యే యుద్ధ ట్యాంక్‌ను నడిపింది. ఈ ఘటనకు చెందిన ఫోటోలను ప్రభుత్వం మీడియా రిలీజ్ చేసింది. జూ యే ఆర్మీ ట్యాంక్‌ను డ్రైవ్ చేస్తుండగా.. ఆమె పక్కనే కిమ్ జాంగ్ కూర్చున్నారు. ఆ ట్యాంకర్‌పై మరికొంత మంది సైనిక అధికారులు కూడా ఉన్నారు. ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ ఆ ఫోటోలను రిలీజ్ చేసింది. టీనేజ్ అమ్మాయి జూ యే గత కొన్నాళ్ల నుంచి కిమ్ పక్కనే తరుచూ కనిపిస్తూ ఉన్నది. అయితే బహుశా ఆ అమ్మాయిని భవిష్యత్తు దేశాధినేతగా కిమ్ తీర్చిదిద్దుతున్నారేమో అన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా రిలీజైన ఫోటోల్లో కిమ్ కుమార్తె డ్రైవర్ సీట్లు కూర్చున్నది. చాలా ఫోకస్ పెట్టి మరీ యుద్ధ ట్యాంక్‌ను నడిపింది. ఇటీవల ఫైరింగ్ రేంజ్లో రైఫిల్‌తో ఆ అమ్మాయి కనిపించిన విషయం తెలిసిందే. మరో చోట హ్యాండ్‌గన్‌తో షూటింగ్ చేస్తున్న పిక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఆ అమ్మాయికి చెందిన పేరు కానీ, వయసు కానీ అధికారికంగా ప్రభుత్వం వెల్లడించలేదు. ఉత్తర కొరియా సైనిక దళంలోకి కొత్త యుద్ధ ట్యాంక్‌లు వచ్చాయి. గురువారం ఆ ట్యాంక్‌లను కిమ్ పరిశీలించారు. డ్రోన్లు, యాంటీ ట్యాంక్ మిస్సైళ్లను ఆ ట్యాంక్‌తో పేల్చవచ్చు. బాలిస్టిక్, న్యూక్లియర్ వెపన్స్‌ను ఆధునీకరించేందుకు ఇటీవల కిమ్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త ట్యాంక్‌లను పరిశీలించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

