ప్యాంగ్యాంగ్, ఫిబ్రవరి 28: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో కఠిన ఆదేశాలు ఇచ్చారు. దేశంలోని పిల్లలు హాలీవుడ్, ఇతర విదేశీ సినిమాలు చూస్తూ పట్టుబడితే ఐదేండ్ల జైలు శిక్ష విధించనున్నట్టు ప్రకటించారు. పట్టుబడిన పిల్లల తల్లిదండ్రులను కూడా కార్మిక శిబిరాలకు తరలించి ఆరు నెలల పాటు వారితో చాకిరీ చేయించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.