సియోల్, నవంబరు 1: ఉత్తర కొరియా సరికొత్త బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. గురువారం హ్వసంగ్-19 అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు ఆ దేశ అధికారిక టీవీ ఛానల్ ప్రకటించింది.
వీడియోను సైతం ప్రసారం చేసింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, ఆయన కుమార్తె ఈ ప్రయోగా న్ని చూస్తున్నట్టుగా వీడియోలో కనిపించిం ది. ఘన ఇంధనంతో నడిచే ఈ క్షిపణి ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యూహాత్మక క్షిపణి అని కేసీఎన్ఏ ప్రకటించింది. ఈ క్షిపణి అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా చేరుకోగల సామర్థ్యం ఉన్నట్టు చూపించుకుంది.