బుషెహర్: ‘ఇరాన్‌తో దౌత్య చర్చలు వద్దు.. మా మత పాలకులపై దాడి చేసి వారిని అంతం చేయండి’ అంటూ ట్రంప్‌ను కోరుతూ ఒక యువకుడు తన ఆత్మహత్యకు ముందు విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ యువకుడి మాటలు ఇరాన్ దేశ అంతర్గత సంక్షోభం, అంతర్జాతీయ దౌత్యంపై చర్చకు దారి తీస్తున్నది. దక్షిణ పోర్టు సిటీ అయిన బుషెహర్‌కు చెందిన హమీదీ అనే యువకుడు ఆంగ్లంలో చేసిన 10 నిమిషాల వీడియోలో ఇటీవల దేశంలో జరిగిన ఆందోళనలో వేలాది మందిని పాలకులు హతమార్చిన విషయాన్ని తెలిపాడు.