అర్నబ్ తుఫాన్‌తో 15 రోజులుగా అడవిలో చిక్కుకుని..
అర్నబ్ తుఫాన్ లో చిక్కుకుని గల్లంతైన 47 ఏండ్ల ఉపాధ్యాయుడు 15 రోజుల తర్వాత అటవీ ప్రాంతంలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఒడిశాలోని కందమాల్ జిల్లాలో జరిగింది.
- సజీవంగా బయటపడ్డ ఉపాధ్యాయుడు
- కేకలు విని గుర్తించిన గొర్రెల కాపరి
భువనేశ్వర్, నవంబర్ 15: అర్నబ్ తుఫాన్ లో చిక్కుకుని గల్లంతైన 47 ఏండ్ల ఉపాధ్యాయుడు 15 రోజుల తర్వాత అటవీ ప్రాంతంలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఒడిశాలోని కందమాల్ జిల్లాలో జరిగింది. బాధితుడు బలహీనంగా చేసిన అరుపులు విన్న ఒక గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆయనను అటవీ ప్రాంతం నుంచి రక్షించారు. దుబా ప్రాంతం సర్సపేట ప్రాథమిక పాఠశాలలో మోహన్ కుమార్ మహారణ టీచర్‌గా పనిచేస్తున్నారు.
అక్టోబర్ 29న అర్నబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో మోహన్ కుమార్ కనిపించకుండా పోయారు. స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా డంగేసి గ్రామం సమీపంలో కొండచరియ విరిగిపడి, కొండవాలులో చిక్కుకుపోయారు. ఆయన ఇన్ని రోజులు ‘దాహం తీర్చుకోవడానికి గోతిలో చేరిన బురదనీటిని, సమీపంలోని వాగుల నీటిని తాగారు. అడవిలో దొరికిన తినదగిన వాటిని తిన్నారు’ అని ఆయన భార్య చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

