ఎన్నికల ఖర్చులపై వివాదం!
ఎన్నికల ఖర్చుల బకాయిల చెల్లింపు వ్యవహారం రాష్ట్ర సీఈవో కార్యాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా అదనంగా ఖర్చు చేసిన సుమారు రూ.90 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
- రూ.90 కోట్ల వరకు బకాయిలు ఇవ్వాలన్న డిప్యూటీ కలెక్టర్ల సంఘం
- 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో అదనపు ఖర్చులైనట్టు వెల్లడి
- బడ్జెట్ పరిధిలోని బిల్లులన్నీ చెల్లించాం: ఎన్నికల సంఘం వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ఖర్చుల బకాయిల చెల్లింపు వ్యవహారం రాష్ట్ర సీఈవో కార్యాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లుల వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా అదనంగా ఖర్చు చేసిన సుమారు రూ.90 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
బడ్జెట్ కేటాయింపుల పరిధిలో ఉన్న బిల్లులన్నీ ఇప్పటికే చెల్లించామని, ఎలాంటి బకాయిలు లేవని ఎన్నికల సంఘం వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్నికల నిర్వహణ కోసం వివిధ ఖర్చుల కింద కేటాయించిన బడ్జెట్ సరిపోలేదని, అదనపు వ్యయం చేసినట్టు డిప్యూటీ కలెక్టర్ల సంఘం పేరొన్నది. దీంతో పలు నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు) ఎన్నికల సంబంధిత ఖర్చుల కోసం వ్యక్తిగతంగా అప్పులు చేయాల్సి వచ్చిందని తెలిపింది. అదనపు నిధుల విడుదలలో జాప్యం కారణంగా అప్పులు ఇచ్చిన వారి నుంచి అధికారులకు ఒత్తిడి పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేసింది.
అదనపు ఖర్చుకు అనుమతి ఎవరిచ్చారు?
బడ్జెట్ కేటాయింపుల పరిధిలోని అన్ని బిల్లులను ఇప్పటికే చెల్లించామని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఎన్నికల ఖర్చుల నిర్వహణ, బిల్లుల చెల్లింపుల బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని స్పష్టంచేశాయి. మంజూరైన బడ్జెట్‌కు మించి అదనపు ఖర్చులు చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేటాయింపులకు మించి చేసిన వ్యయంపై, ఆ ఖర్చులకు అనుమతి ఇచ్చిన అధికారుల వివరాలతో నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్లను కోరినట్టు వెల్లడించాయి. అదనపు ఖర్చులకు సంబంధించిన ఉత్తర్వులు, బిల్లులు, ఖాతాల వివరాలను జిల్లా కలెక్టర్ల నుంచి కోరినట్టు తెలంగాణ సీఈవో కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కలెక్టర్ల నుంచి సమాధానాలు అందిన తర్వాత పూర్తి నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పిస్తామని వెల్లడించారు. దీంతో అదనపు బిల్లుల చెల్లింపుల వ్యవహారం కలెక్టర్ల నివేదికలపై ఆధారపడి ఉన్నది. మంజూరైన నిధులు సరిపోని పరిస్థితుల్లో విధుల నిర్వహణ కోసం చేసిన అదనపు వ్యయాన్ని ప్రభుత్వం, ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం కోరుతున్నది. ఇప్పటికే అదనపు బడ్జెట్ కేటాయింపుల కోసం ప్రతిపాదనలు పంపినప్పటికీ అవి పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపింది. కాగా, సుమారు రూ.90 కోట్ల ఎన్నికల అదనపు వ్యయంపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం డిమాండ్, ఎన్నికల సంఘం లేవనెత్తిన అనుమతుల అంశం మధ్య వివాదం తలెత్తింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

