దవాఖానల దుస్థితిైపె కోర్టుల ఆగ్రహం
ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎం దవాఖానల్లో జరిగిన ఉదంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా ఘటనలపై సుమోటోగా విచారణ జరుపాలని హైకోర్టుకు సూచించడం, ఆ దిశగా రాష్ట్ర ధర్మాసనం చర్యలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఆ ఘటనలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికీ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
- ఆదిలాబాద్, వరంగల్ ఉదంతాలపై సీరియస్‌గా స్పందించిన సుప్రీంకోర్టు
- సుమోటోగా తీసుకోవాలని హైకోర్టుకు ఆదేశం
- ఆ దిశగా విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు
- రేవంత్ సర్కార్‌కు, కేంద్ర ఆరోగ్య శాఖకు నోటీసులు
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎం దవాఖానల్లో జరిగిన ఉదంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా ఘటనలపై సుమోటోగా విచారణ జరుపాలని హైకోర్టుకు సూచించడం, ఆ దిశగా రాష్ట్ర ధర్మాసనం చర్యలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఆ ఘటనలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికీ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో విచారణ చేపట్టనున్నది. గత సెప్టెంబర్‌లో 24 గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో రెండు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లో అర్ధరాత్రి వేళ ఏసీ షార్ట్ సర్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఒకరోజు ముందు వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) దవాఖానలోని ఆరోగ్యశ్రీ వార్డులో కాంక్రీట్ స్లాబ్, ఫాల్స్సీలింగ్ పెచ్చులూడిపడటంతో పక్షవాతానికి చికిత్స పొందుతున్న ఒక రోగితోపాటు సహాయకులు, పారిశుద్ధ్య సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలు రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల దుస్థితిని, రేవంత్‌రెడ్డి సర్కార్ పర్యవేక్షణ లోపాన్ని బట్టబయలు చేశాయి.
సుప్రీంకోర్టులో పిల్
రిమ్స్ అగ్నిప్రమాదం, ఎంజీఎం పైకప్పు కూలిన ఘటనలు రాజ్యాంగంలోని ఆర్టికల్-21 ప్రకారం పౌరుల జీవించే హకును ఉల్లంఘించడమేనని పేరొంటూ హైకోర్ట్ అడ్వకేట్ మణిదీప్ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆర్థిక పరిమితులను సాకుగా చూపి ప్రజల ప్రాణాలను కాపాడే రాజ్యాంగ బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోలేవంటూ ‘పశ్చిమబంగ ఖేత్ మజ్దూర్ సమితి’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును సైతం ఉటంకించారు. పిల్ ద్వారా ఐదు కీలక అంశాలపై దృష్టి సారించాలని కోరారు. రెండు ప్రమాదాలపై పూర్తిస్థాయి సాంకేతిక, అధికారిక విచారణ నివేదికలు తెప్పించడం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానాల భవనాల ఆధునికీకరణ, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా శా శ్వత పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చే యడం వంటి చర్యలు చేపట్టేలా చూడాలని కోరారు.
మణిదీప్ పంపిన నివేదికను పరిగణనలోనికి తీసుకొని, సుమోటో పిల్‌ను నమోదు చేయాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు సీజేఐ సూర్యకాంత్ సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సైతం తక్షణం స్పందించింది. ఆ రెండు ఘటనలపై సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) నమోదు చేయాలని రిజిస్ట్రీని హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యామ్కోశీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ పీ శ్యామ్ కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. తదుపరి విచారణలోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, కేంద్ర ఆరోగ్య, కు టుంబ సంక్షేమ శాఖను హైకోర్టు ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

