బీజింగ్, మే 19: ఇప్పటివరకు ఏ దేశమూ కూడా రోదసిలో సూపర్ కంప్యూటర్లను ఏర్పాటుచేయలేదు. ప్రపంచంలోనే మొదటిసారిగా చైనా దీనిని ఆవిష్కరించబోతున్నది. ఏఐ (కృత్రిమ మేథస్సు)తో పనిచేసే 12 శాటిలైట్స్‌ను రోదసిలోకి పంపి.. ఈ శాటిలైట్స్ కూటమితో అత్యంత శక్తివంతమైన సూపర్‌కంప్యూటర్ నెట్‌వర్క్‌ను సృష్టించబోతున్నది. చైనా ఏరోస్పేస్ సైన్స్, టెక్నాలజీ కార్పొరేషన్ చేపట్టిన ‘స్టార్ కంప్యూటింగ్’ ప్రోగ్రామ్‌కు సంబంధించి తొలి దశ ప్రయోగం సక్సెస్ అయ్యిందని చైనా వెల్లడించింది. నిర్దేశిత భూకక్ష్యలో 12 ఏఐ శాటిలైట్స్‌ను చేర్చామని తెలిపింది.
అంతరిక్షంలోకి పంపిన ఒక్కో ఏఐ శాటిలైట్ ఒక సెకండ్‌కు 744 ట్రిలియన్ ఆపరేషన్స్‌ను ప్రాసెస్ చేస్తుందని చెప్పింది. భూమిపైన ఏర్పాటుచేసిన సూపర్ కంప్యూటర్ వ్యవస్థ కన్నా ఇది శక్తివంతమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు.