New Year 2025 | విశ్వంపై కొత్త ఏడాది ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని దేశాలు 2025 ఏడాదికి ఘనంగా స్వాగతం పలికాయి. కిరిబాటి దీవి (Kiribati Leads), న్యూజిలాండ్ ప్రజలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు. అయితే, సాధారణంగా భూమ్మీద ఉన్న ప్రజలు కొత్త ఏడాదికి ఎన్నిసార్లు స్వాగతం పలుకుతారు..? ఒక్కసారే కద. అయితే, అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములు మాత్రం 16 సార్లు ఈ అనుభూతిని సొంతం చేసుకుంటారట. అందుకు కారణం.. ఐఎస్ఎస్ గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుండటమే.
ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) గంటకు 28,000 కిలో మీటర్ల వేగంతో తిరుగుతుంది. దీంతో 90 నిమిషాల్లో భూమి చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్లోని వ్యోమగాములు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి భూమిపై పగలు, 45 నిమిషాల తర్వాత రాత్రిని చూస్తారు. మరోవైపు ఐఎస్ఎస్ ఒక రోజులో భూమి చుట్టూ 16 సార్లు పరిభ్రమిస్తుంది. దీంతో అందులోని వ్యోమగాములు ప్రతి రోజు 16 సార్లు సూర్యోదయాన్ని, 16 సార్లు సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తారు. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్లోని వ్యోమగాములు కొత్త ఏడాదిని 16 సార్లు స్వాగతం పలుకుతారు. తద్వారా న్యూఇయర్‌ను 16 సార్లు సెలబ్రేట్ చేసుకునే అరుదైన అవకాశం వారికి లభిస్తుందన్నమాట.
Also Read..
New Year 2025 | భారత్ కంటే ముందుగా న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకునే దేశాలేవో తెలుసా..?
Elon Musk | కొత్త ఏడాది వేళ.. పేరు మార్చుకున్న ఎలాన్ మస్క్..!
Janhvi Kapoor | ఈ ఏడాది ఇదే బెస్ట్ మూవీ.. అమరన్పై జాన్వీ కపూర్ రివ్యూ