బ్యాంకాక్ ;2023కు వీడ్కోలు చెప్పి 2024లోకి అడుగు పెడుతున్న క్షణాల్ని ప్రపంచ దేశాలు ఆనందోత్సాహాలతో ఘనంగా ఆహ్వానించాయి. కొత్త ఆశలతో.. సరికొత్త ఆశయాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికాయి. ద్వీప దేశం కిరిబాటి తొలుత కొత్త సంవత్సరంలోకి ప్రవేశించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, ద.కొరియా, ఉ.కొరియా, చైనా, హాంకాంగ్, ఫిలిప్పైన్స్ తదితర దేశాల్లో ఆదివారం రాత్రి సంబరాలు మిన్నంటాయి. సిడ్నీ, న్యూయార్క్, ఆక్లాండ్ తదితర నగరాల్లో కండ్లు చెదిరేలా వెలుగుల వేడుకలు నిర్వహించారు.