Burundi | బుజింబురా, మార్చి 30: ఆఫ్రికాలోని బురుండి దేశంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తున్నది. అంతుచిక్కని ఈ వైరస్ కారణంగా 24 గంటల్లోనే ముగ్గు రు మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ సోకిన వారికి ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. జ్వరం, తలనొప్పి, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా ఉన్నట్టు బురుండి ఆరోగ్య శాఖ వెల్లడించిం ది. బురుండిలోని బజిరో ప్రాంతంలో ఈ వైరస్ సోకింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ పట్టణాన్ని క్వారంటైన్ చేశారు. ఇటీవల బురుండి పక్కన ఉండే టాంజానియాలోనే మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో చుట్టుపక్కల దేశాలకు ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే, బురుండిలో వ్యాపిస్తున్నది మార్గ్బర్గ్ వైరస్సేనా అనేది తెలియాల్సి ఉంది.