దుబాయ్, అక్టోబర్ 6: దుబాయ్‌లో తీయటి పానీయాలపై మరింతగా షుగర్ ట్యాక్స్ విధించేందుకు రంగం సిద్ధమైంది. ఎనర్జీ డ్రింక్స్ సహా వివిధ రకాల ఉత్పత్తులపై 100శాతం షుగర్ ట్యాక్స్ విధించబోతున్నట్టు దుబాయ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఇందు కు సంబంధించిన సిద్ధం చేసిన ప్రతిపాదిత ‘షుగర్ ట్యాక్స్’ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు సోమవారం ప్రకటించింది.
ప్రస్తుతం యూఏఈలో చక్కెర, తీయటి పానీయాలన్నింటిపైనా 50శాతం ఎక్సైజ్ ట్యాక్స్‌ను విధించేవారు. ఇకపై ప్రతి 100ఎంఎల్ తీయటి పానీయంలో చక్కెర శాతాన్ని అనుసరించి పన్ను విధానాన్ని కొత్తగా దుబాయ్ ప్రవేశపెట్టింది.