Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
Balen Shah: నేపాల్ ప్రధాని బాలెన్ షా (Balen Shah) ఆనవాయితీకి చెక్ పెట్టారు. జెన్‌జీ ప్రతినిధిగా ప్రధాని పదవి చేపట్టిన ఆయన కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ ద్వైపాక్షిక చర్చల కోసం భారత్‌ను ఎంచుకున్నారు.
Balen Shah: నేపాల్ ప్రధాని బాలెన్ షా (Balen Shah) ఆనవాయితీకి చెక్ పెట్టారు. జెన్‌జీ ప్రతినిధిగా ప్రధాని పదవి చేపట్టిన ఆయన కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ ద్వైపాక్షిక చర్చల కోసం భారత్‌ను ఎంచుకున్నారు. తనకంటే ముందువారు తొలుతు చైనా, టర్కీ, యూకే.. వంటి దేశాలకు వెళ్లగా తను మాత్రం ఇండియాకు తొలి ప్రధాన్యమిచ్చారు. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన చర్చల కోసం నవంబర్‌లో ఆయన విచ్చేస్తున్నారు. బాలెన్ షా ప్రధాని అయ్యాక దేశ ప్రయోజనాల కోసం చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.
జెన్‌జీ ఆందోళనల అనంతరం నేపాల్ ప్రధాని పీఠంపై కూర్చున్న బాలెన్ షా త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఆనవాయితీ ప్రకారం మాజీ ప్రధానులు తమ తొలి విదేశీ పర్యటనకు ఇతర దేశాలను ఎంచుకోగా ఆయన మాత్రం ఇండియాకు ఓటేశారు. మార్చిలో ప్రధాని పదవి చేపట్టిన ఆయన తొలుత భారత దైత్యాధికారులతో మాట్లాడేందుకు నిరాకరించినా.. చివరకు పర్యటనకు సిద్ధమవుతున్నారు.
ఈ నవంబర్లోనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల కోసం బాలెన్ షా విచ్చేస్తున్నారు. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఆయన ఇండియా రానున్నారు. ఖాట్మండు పోస్ట్ కథనం ప్రకారం ఈ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన ప్రధాన నిర్మాణపరమైన ప్రాజెక్టులు, సరిహద్దు వివాదాలు, వరదల నియంత్రణ చర్యలు వంటి అంశాలపై చర్చించే అవకాశముంది.
PM Balen Shah will visit India on 3rd week of November as per team doing official preparations. 🙏 https://t.co/V4nFoDWhRs
— Routine of Nepal banda (@RONBupdates) October 14, 2026
సంప్రదాయానికి బ్రేక్
గత రెండు దశాబ్దాల కాలంలో నేపాల్ ప్రధానులు తమ తొలి విదేశీ పర్యటనకు భారత్‌ను ఎంచుకోవడం ఇదే మొదటిసారి. 2008లో పుష్ప కమల్ ప్రచండ మొదట చైనాలో పర్యటించారు. 2011లో ప్రధానిగా ఝలనాథ్ ఖనల్ ఐక్యరాజ్యసమితి సమావేశం కోసం టర్కీ వెళ్లారు. ఆపై 2021లో షేర్ బహదూర్ డీబా ప్రధానిగా తొలి ద్వైపాక్షిక చర్చలు యూకేతో జరిపారు. 2021 ప్రధాని కేపీ ఓలీ తొలుత భారత్‌లో పర్యటించేందుకు అంగీకరించారు. కానీ, మాట మార్చిన ఆయన చైనాలో పర్యటించారు. కానీ,
జెన్‌జీ నాయకుడిగా ప్రధాని అయిన బాలెన్షా మాత్రం తొలి విదేశీ పర్యటనకు ఇండియాను ఎంచుకున్నారు. ఆగస్టులో వరదల విధ్వంసానికి అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ భారీగా సాయమందించింది. టన్నుల కొద్ది నిత్యావసరాలు, మందులను వరద బాధితుల సహాయార్ధం సైనిక విమానాల్లో తరలించింది. దాంతో.. ఆ కృతజ్ఞతతో ఆయన ఇండియాతో చర్చలకు ప్రాధాన్యం ఇస్తున్నారని సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Balen Shah
- china
- India Tour
- KP Oli
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

