కాఠ్మాండూ, జూలై 12: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు రెండు బస్సులపై విరిగిపడటంతో, అవి పక్కనున్న త్రిశూలి నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 60 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.
వీరిలో ఏడుగురు భారతీయులు ఉన్నారు. చిత్వాన్ జిల్లాలోని నారాయణఘాట్-ముగ్లింగ్ రోడ్లో ఏంజెల్ బస్ 41 మందితో కాఠ్మాండుకు, గణపతి డీలక్స్ బస్ 24 మందితో గౌర్‌కు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని చిట్వాన్ జిల్లా అధికారి ఇంద్రదేవ్ యాదవ్ తెలిపారు.