Border dispute | సరిహద్దు వివాదాన్ని లేవనెత్తిన నేపాల్.. రోడ్డు నిర్మాణ పనులపై అభ్యంతరం
Border dispute | సరిహద్దులో నేపాల్ మరో కొత్త వివాదానికి తెర లేపింది. నో మ్యాన్ ల్యాండ్‌లో రోడ్డు విస్తరణ పనులపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పనులు నిలిపివేసిన భారత ప్రభుత్వం.. రోడ్డు నిర్మాణం సమస్యే కాదని స్పష్టం చేసింది.
Border dispute | భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండు దేశాల సరిహద్దులకు సమీపంలో భారత్‌లో నిర్మిస్తున్న రోడ్డు విస్తరణపై నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ రహదారి సీతామర్హిలోని అనేక ప్రాంతాలను నేపాల్ సరిహద్దులోని భీతమోడ్, జనక్పూర్తో కలుపుతుంది. ఇక్కడ వంతెన నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయాయి.
నేపాల్ సరిహద్దులోని దాదాపు 1.10 కి.మీ.లో రోడ్డు విస్తరణపై కొన్ని రోజుల క్రితం నేపాల్ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర హోంశాఖకు లేఖ పంపినట్లు బిహార్ రాష్ట్ర రోడ్డు నిర్మాణ విభాగం (ఆర్సీడీ) అధికారి ఒకరు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్పష్టంగా గుర్తించిన సరిహద్దు ఉన్నందున నేపాల్ నుంచి వచ్చిన అభ్యంతరాలతో షాక్‌కు గురయ్యామని ఆ అధికారి చెప్పారు.
బిహార్ రాజధాని పాట్నాకు ఉత్తరాన 135 కి.మీ దూరంలో ఉన్న సీతామర్హి జిల్లాలోని సుర్సంద్ బ్లాక్‌లోని సరిహద్దు సమీపంలో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. ఈ నో మ్యాన్ ఏరియాకు రెండు వైపులా రెండు దేశాల చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయి. ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు సగం పూర్తికావచ్చాయి. వంతెన నిర్మిస్తే రాకపోకలు కొనసాగించవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

