Donald Trump | హెచ్-1బీ వీసాల (H1B visa) విషయంలో కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తాజాగా తన స్వరం మార్చారు. విదేశీ ఉద్యోగుల నియామకాన్ని ఆపాలంటూ టెక్ సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మాత్రం తన వైఖరి మార్చారు. అమెరికాకు విదేశీ ప్రతిభ (talent) అవసరమేనని స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్వ్యూలో భాగంగా విలేకరు ‘మన దగ్గర చాలా మంది ప్రతిభావంతులైన కార్మికులు ఉన్నారు’ అని అనగా.. అందుకు ట్రంప్ ‘లేదు, మన దగ్గర లేదు’ అంటూ బదులిచ్చారు. ‘మనదగ్గర అంత ప్రతిభగల వ్యక్తులు లేరు. బయటి నుంచి వచ్చే వారి దగ్గర నుంచి ప్రజలు నైపుణ్యాలను నేర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. అమెరికాలో అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని ట్రంప్ అంగీకరించారు. శ్రామిక శక్తి కొరతను తీర్చేందుకు విదేశీ ప్రతిభ అవసరమేనని నొక్కి చెప్పారు. దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే విదేశీ ప్రతిభను ఉపయోగించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సరైన శిక్షణ లేకుండా తయారీ, రక్షణ రంగాల్లోని ముఖ్యమైన స్థానాల్లో నిరుద్యోగ అమెరికన్లను నియమించుకోలేమన్నారు. అమెరికాకు చెందిన ఉద్యోగులు బయట నుంచి వచ్చే వారి దగ్గర నైపుణ్యాలు నేర్చుకోవాలని ట్రంప్ సూచించారు.
Also Read..
భారత్‌పై విధించిన సుంకాలు తగ్గిస్తాం: ట్రంప్
Donald Trump | విదేశీ విద్యార్థులకు అమెరికాలో ఎలాంటి అడ్డంకులు లేవు : డొనాల్డ్ ట్రంప్
అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా షాక్