ఒట్టావా: అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా షాక్ ఇచ్చింది. 50శాతం స్టడీ పర్మిట్స్ను తగ్గించేందుకు నూతన ఇమిగ్రేషన్ విధానాన్ని తీసుకొస్తున్నది. రాబోయే మూడేండ్లలో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశం సహా తాత్కాలిక నివాస హోదా కలిగినవారి సంఖ్యను తగ్గించబోతున్నట్టు కెనడా ఫెడరల్ ప్రభుత్వం ప్రకటించింది. 2025 బడ్జెట్, ఇమిగ్రేషన్ ప్లాన్లో భాగంగా కెనడా తాజాగా ఈ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లతో వస్తున్న ఆదాయంపై కెనడా యూనివర్సిటీలు, కాలేజీలు ఎక్కువగా ఆధారపడ్డాయి. నూతన విధానంతో వాటి ఆదాయాలు పడిపోవటం ఖాయం.