వాషింగ్టన్: భారత్-అమెరికాల మధ్య కుదిరే కొత్త వాణిజ్య ఒప్పందం సముచితంగా ఉంటుందని, భారత్‌పై తాము విధించిన సుంకాలు తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వెల్లడించారు. భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గార్ ఓవల్ ఆఫీస్‌లో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ… ‘రష్యా చమురు కొనుగోలును భారత్ తగ్గించినందున మేం ఆ దేశంపై సుంకాలను తగ్గిస్తాం. ఏదో ఒక దశలో మేం వాటిని తగ్గిస్తాం’ అని అన్నారు.