సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 03, 2020 , 21:31:05

జాతీయ గృహిణుల దినోత్సవం.. ప్రాముఖ్యత తెలుసా?

జాతీయ గృహిణుల దినోత్సవం.. ప్రాముఖ్యత తెలుసా?

హైదరాబాద్‌: గృహిణి.. ఇల్లు నడిచేందుకు చోదకశక్తి. ఆమె కృషి, త్యాగం వల్లే కుటుంబం ఆనందంగా ఉంటుంది. కనుక ఆమెను గౌరవించుకునేందుకు ఒకరోజును కేటాయించారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వారిపై పనిభారం పెరిగింది. అంతా ఇంటికే పరిమితం కావడంతో ఇంటిల్లిపాదికి ఏంకావాలో ఆమె చూసుకున్నది. అందరికీ సకాలంలో భోజనం అందించడం, ఇంటిని శుభ్రపరచడం, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం, ఇంటి పనులను నిర్వహించడంద్వారా మన జీవనాన్ని సులభతరం చేశారు. వీరు లేకుంటే ఇల్లు గందరగోళమే.   

వీరి సేవలను ప్రశంసించేందుకుగానూ ప్రతి ఏటా నవంబర్ 3న జాతీయ గృహిణుల దినోత్సవం  లేదా గృహనిర్వాహక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇదిలా ఉంటే ఈ పదం భార్య లేదా తల్లికి మాత్రమే పరిమితం కాదు. ఆధునిక సమాజంలో, ఈ పదం తమ ఇంటిని క్రమంగా ఉంచడానికి కష్టపడేవారికి వర్తిస్తుంది. కాగా, చారిత్రాత్మకంగా గృహిణి అనే పదం ఒక కుటుంబంలో భార్య లేదా మాతృకను సూచిస్తుంది. గృహిణి దినోత్సవాన్ని మొదట జరుపుకున్న ఖచ్చితమైన తేదీ స్పష్టంగా లేదు. అయితే మహిళ కృషిని తక్కువగా అంచనా వేయడం చూడలేక ఓ గృహిణి ఈ దినోత్సవానికి శ్రీకారం చుట్టినట్లు అంతా నమ్ముతారు. ఈ రోజు ఇప్పటికీ ఇతర సెలవుదినాల వలె జనాదరణ పొందనప్పటికీ, ఆలోచనాపరంగా ఇది గణనీయమైన పురోగతిని సాధించింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.