కొలంబో : ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను ఇంధన కొరత వెంటాడుతోంది. పెట్రోల్, డీజిల్ లభ్యత తగ్గుముఖం పట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన సమస్యకు చెక్ పెట్టేందుకు వారానికి సరిపడా వినియోగదారులకు ఇంధన సరఫరా కోసం నేషనల్ ఫ్యూయల్ కార్డులను విద్యుత్, ఇంధన మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.
ఈ కార్డుదారులకు ప్రతి వారం పెట్రోల్ కోటాను కేటాయిస్తారు. ప్రతి వాహనానికి ఫ్యూయల్ పాస్ జారీ చేస్తారు. వెహికల్ ఛేసిస్ నెంబర్, వివరాలు వెరిఫై చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ను కేటాయిస్తారు. నెంబర్ ప్లేట్ చివరి అంకె ఆధారంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వారానికి రెండు రోజులు ఇంధనం సరఫరా చేస్తారు.
ఇకా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాయంతో విద్యుత్, ఇంధన మంత్రిత్వ శాఖ నేషనల్ ఫ్యూయల్ కార్డును ప్రవేశపెట్టింది. ఇక విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడంతో ఇంధన దిగుమతులకు సరిపడా నిధులు లేకపోవడంతో శ్రీలంక ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.