సౌర కుటుంబంలో నాలుగో గ్రహమైన అంగారుకుడిపై భారీ ఉల్కాపాతం జరిగింది. గతేడాది డిసెంబరులో ఒక ఉల్క.. అరుణగ్రహంపై కూలింది. దీంతో అక్కడ భారీ గొయ్యి ఏర్పడింది. ఈ ఉల్కాపాతాన్ని నాసాకు చెందిన ఇన్సైట్ ల్యాండర్ విన్నదట. దాంతో అక్కడకు చేరుకొని ఫొటోలు తీసుకుంది.
ఈ ఉల్కాపాతం జరిగిన ప్రాంతంలో సుమారు 150 మీటర్లు (అంటే 490 అడుగుల) వెడల్పయిన గొయ్యి ఏర్పడింది. అలాగే ఈ ప్రమాదం వల్ల 4 మాగ్నిట్యూడ్‌తో ఆ ప్రాంతమంతి కంపించిందని నాసా తెలిపింది. ఈ ఘటనలో భారీ సైజులో ఉన్న మంచు గడ్డలు కూడా ఎగిరిపడినట్లు తెలిపింది.